టాలీవుడ్ సినీ స్టార్ విజయ్ దేవరకొండతో రవి కిరణ్ కోలా సినిమా తీయబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ధ్రువీకరించారు కూడా. ప్రస్తుతం దిల్ రాజు ఇటీవల జైలర్ చిత్రం రైట్స్ భారీ ఎత్తున ఆదాయం లభించేలా చేసింది.
విజయ్ దేవరకొండ , సమంత రుత్ ప్రభు తో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషీ ఆశించిన దానికంటే సక్సెస్ అయ్యింది. మ్యూజికల్ గా బిగ్ హిట్ గా నిలిచింది. ఇక దిల్ రాజు అనేసరికల్లా హీరో, హీరోయిన్ల కంటే సినిమాలకు సంబంధించి కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడతారు.
రవి కిరణ్ కోలా ఈ మధ్యన వెలుగులోకి వచ్చారు. కొత్త టాలెంట్ ను గుర్తించడం, ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారు దిల్ రాజు. మరో వైపు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాప్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు నిర్మాత.
మరో వైపు దిల్ రాజజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇంటిల్లిపాదిని ఆకట్టుకునేలా కంటెంట్ బాగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇదిలా ఉండగా రాజా వారు రాణి గారు పేరుతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు రవి కిరణ్ కోలా.