ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. కారణం తొలిసారిగా జాక్ పాట్ కొట్టేసింది ఈ అమ్మడు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ టీంలో ఒకడైన బుచ్చిబాబు తీసిన ఉప్పెన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో వైష్ణవ్ తేజ్ , కృతీ శెట్టి నటించి మెప్పించారు. ప్రతి నాయకుడిగా తమిళ సినీ నటుడు విజయ్ సేతుపతి హీరోయిన్ కు తండ్రిగా నటించాడు.
ఇదే సమయంలో తదుపరి చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ తో తీయనున్నాడు. ఇందుకు సంబంధించి కథ కూడా ఓకే అయినట్లు టాలీవుడ్ లో టాక్. అయితే తాజాగా తాను తెరకెక్కించే చిత్రంలో ఎవరిని హీరోయిన్ గా అనుకుంటున్నారనే దానిపై గత కొంత కాలంగా ఉత్కంఠ నెలకొంది.
దానికి ఇవాళ దర్శకుడు చెక్ పెట్టారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలనాటి నటి రవీనా కూతురు రాషా టండానీ ని ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. దీంతో అందానికి కేరాఫ్ గా ఉన్న ఈ లవ్లీ గర్ల్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఫోటో షూట్ కూడా పూర్తయిందని ఇక నటించడమే తరువాయి అని సమాచారం. మొత్తంగా చెర్రీతో నటించనుండడం విశేషం.