Raveena Tandon : బాలీవుడ్ లో బ్యూటీగా గుర్తింపు పొందింది రవీనా టాండన్. ఓ వైపు తనతో పోటీకి కూతురు వచ్చినా ఎక్కడా అందం తగ్గడం లేదు. 1990లో మాధురీ దీక్షిత్, మనీషా కోయిరాలా, అయేషా జుల్కా, సోనాలి బెంద్రేతో పోటీ పడింది. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించింది. తెలుగులో కూడా తను సుపరిచమే. ప్రస్తుతం వెబ్ సీరీస్ పై ఫోకస్ పెట్టింది. కానీ ఎక్కడా తగ్గడం లేదు. బాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకుంది ఈ బ్యూటీ.
Raveena Tandon Viral
తను సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తించి కేంద్ర సర్కార్ పద్మశ్రీ అవార్డును బహూకరించింది. ఇది తన జీవితంలో మరిచి పోలేని అనుభూతిగా మిగిల్చేలా చేసిందని పేర్కొంది రవీనా టాండన్(Raveena Tandon). తన వయసు 50 ఏళ్లు. అయినా ఇప్పుడు తనను చూస్తే అలా అనిపించదు. ఏదో 25 ఏళ్లు అనుకుంటాం. దీని సీక్రెట్ ఏమిటి అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. పూర్తిగా పాజిటివ్ దృక్ఫథంతో ఉంటానని అందుకే తనకు ఎలాంటి రోగాలు రావంటూ తెలిపింది.
తనకు ప్రతి రోజూ ముఖ్యం. రేపు ఏం జరుగుతుందోనన్న బెంగ అంటూ ఉండదని స్పష్టం చేసింది. తనతో పాటు తన కూతురు, కుటుంబం అందరం హాయిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాం. ఇంకొకరి గురించి ఆలోచించక పోవడమే తన జర్నీలో సక్సెస్ కు కారణమని పేర్కొంది రవీనా టాండన్.
తను అక్టోబర్ 26, 1974లో మహారాష్ట్రలో పుట్టింది. 1991 నుంచి 2006 దాకా 2011 నుంచి నేటి దాకా సినీ రంగంలో కొనసాగుతూ వస్తోంది. అనిల్ థడానీని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు. తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 2 చిత్రంలో రమికా సేన్ గా నటించింది మెప్పించింది మరోసారి.
Also Read : Sonali Bendre Sensational :అది అరబిక్ కడలందం సోనాలి స్వంతం