Raveena : ముంబై – బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురై ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రముక సినీ నటులు, టెక్నీషియన్స్, దర్శక, నిర్మాతలు సీరియస్ గా స్పందించారు. రోజు రోజుకు నగరంలో తమకు రక్షణ లేకుండా పోతోందంటూ ఆందోళన చెందుతున్నారు.
Raveena Tandon Comment
ఈ తరుణంలో ప్రముఖ తార రవీనా టాండన్(Raveena) నిప్పులు చెరిగారు. కేవలం సెలిబ్రిటీలనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పరంపర, ఇంతిహాన్ వంటి చిత్రాలలో సైఫ్ తో కలిసి నటించానని, తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు.
ఒకప్పుడు సురక్షితమైన నివాస ప్రాంతంగా ముంబై ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు రవీనా టాండన్. బాంద్రా అసాంఘిక శక్తులు, ప్రమాద మోసాలు, హాకర్ మాఫియా, ఆక్రమణదారులు, భూ కబ్జాదారులకు అడ్డాగా మారి పోయిందని ఆరోపించింది.
ఈ సమయంలో కలిసికట్టుగా అందరూ ధైర్యంగా ఎదుర్కొనేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు నటి. ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఎవరినీ నమ్మే స్థితిలో లేకుండా పోయిందని వాపోయింది ఈ అమ్మడు.
Also Read : Sukumar Interesting Comment : జీవన సౌందర్యం వినోదం