తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ – 7 కంటిన్యూగా కొనసాగుతోంది. రోజు రోజుకు ఏం జరుగుతుందో, ఎవరు చివరి దాకా ఉంటారనే దానిపై ఉత్కంఠ రేపుతోంది. ఈ రియాల్టీ షోకు ప్రయోక్తగా నటుడు అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నాడు.
షో నుండి బయటకు వెళ్లి పోయిన రతికా రోజ్ ఉన్నట్టుండి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అందరి కళ్లు ఈ ముద్దుగుమ్మపైనే ఉండి పోయాయి. ఇక రైతు బిడ్డగా పేరు పొందిన ప్రశాంత్ , రతిక రోజ్ మధ్య మాటలు కొనసాగాయి. కెమెరాలన్నీ ఆమెపైనే ఫోకస్ పెట్టాయి.
బిగ్ బాస్ లో రతిక రోజ్ కొంచెం ముందుకు వెళ్లింది. ఆపై రైతు బిడ్డను అనరాని మాటలు అన్నది. ఆ తర్వాత ఎందుకు మాట్లాడటం లేదంటూ వాపోయింది. మనోడిని ప్రశ్నించింది. తీరా నన్ను అవమానించింది చాలక ఇప్పుడు సయోధ్యకు వస్తే ఎలా అంటూ నిలదీశాడు రైతు బిడ్డ.
ఈ ఇద్దరి వ్యవహారంపైనే బిగ్ బాస్ రోజంతా కొనసాగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హల్ చేస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. మొత్తంగా బిగ్ బాస్ వ్యూయర్స్ లో మరింత క్యూరియాసిటీని పెంచే పనిలో సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.