నటుడు అక్కేనేని నాగార్జున హోస్ట్ చేస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ 7 ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైతు బిడ్డగా పేరు పొందిన ప్రశాంత్ తో మిల్కీ బ్యూటీగా పేరున్న రతికా రోజ్ మధ్య సంభాషణలతో కూడిన ఎపిసోడ్ ఇప్పుడు టాప్ లో కొనసాగుతోంది.
ఇక రతికా రోజ్ కు సంబంధించి యూత్ తెగ వెతుకుతున్నారు. ఈ బ్యూటీ ఆ మధ్యన దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రత్యక్షం అవుతున్నాయి. అందం అన్నది లేక పోతే ఈ లోకం వ్యర్థం అన్నట్టుగా ఆమె మాటలు, కళ్లు ఉంటున్నాయి.
ఎంతైనా కళాత్మకత ఉట్టి పడే మోము ఉండడంతో చూసిన వాళ్లంతా బిగ్ బాస్ ప్రోగ్రాంకు ఫిదా అయి పోతున్నారు. ఆ వెంటనే రతికా రోజ్ కు ఫ్యాన్ అయి పోతున్నారు. ఇందులో ఎక్కువగా కుర్రాళ్లు ఉండడం విశేషం.
ఏది ఏమైనా అందం ఉన్నది చూసేందుకే కదూ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక హగ్ లు, కిస్ లు దాటేశాయి సినిమా, ఓటీటీ, బుల్లి తెర మాధ్యమాలు. ఇప్పుడన్నీ షరా మూమూలేనని జనం సర్దుకుంటున్నారు. అందం, సెక్స్ ను ఎరగా చూపి సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తంగా బిగ్ బాస్ బ్యూటీ వైరల్ అవడం మాత్రం ఒకింత ఆశ్చర్యం అనిపిస్తోంది.