స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ – రియాల్టీ షో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఇందులో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతున్నారు కంటెస్టెంట్స్. రోజు రోజుకు ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తారనే దానిపై వ్యూయర్స్ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.
ఇక ఎప్పటి లాగే కింగ్ నాగార్జున తనదైన స్టైల్ లో బిగ్ బాస్ షోను నడిపిస్తున్నాడు. గతంలో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ నిర్వహించినా చివరకు నాగ్ సెట్ అయ్యాడు. టీఆర్పీ రేటింగ్ కూడా దూసుకు పోతోంది. కాన్సెప్ట్ ను డిఫరెంట్ గా డిజైన్ చేయడం, హగ్ లు , మాటలు ఒకింత హద్దు దాటి పోవడం కూడా విమర్శలకు తావు ఇచ్చినా బిగ్ బాస్ కు ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు.
బిగ్ బాస్ 7 మూడో వారంలో కంటెస్టెంట్ల మధ్య భావోద్వేగాలు , గొడవలు హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం రెండు వారాలు ముగిశాయి. ప్రస్తుతం ఏడుగురు మిగిలారు చివరకు. వీరిలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతూ పోతోంది. ప్రధానంగా ఇప్పటికే గుర్తింపు పొందిన రతిక రోజ్ వ్యక్తిగత రేటింగ్ లో టాప్ లో నిలవడం విశేషం.
మొత్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ దూసుకు పోతోంది రతిక రోజ్.