Rashmika: డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక

డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక

Hello Telugu - Rashmika

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియోపై మరోసారి స్పందించింది. ‘యానిమల్‌’ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న రష్మిక(Rashmika)… ఆమె తన డీప్‌ ఫేక్‌ వీడియో, ట్రోల్స్‌పై మీడియాతో మాట్లాడారు. ఫేక్‌ వీడియోలు సృష్టించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అలాంటి మార్ఫింగ్ వీడియోలు బయటకు వచ్చినప్పుడు మనం సైలంట్ గా ఉండకూడదు. కచ్చితంగా స్పందించాలి.

నాపై వచ్చిన డీప్ ఫేక్ వీడియోపై ఫస్ట్ నాకు అమితాబ్ బచ్చన్‌ సపోర్ట్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన చాలా మంది మద్దతు తెలిపారు. మొదట్లో ఆ వీడియో చూసి బాధపడ్డాను. చాలా మంది సెలబ్రిటీలకు ఇలానే జరుగుతోంది. ఏం చేయగలం అనిపించింది. అయితే ఈ విషయాన్ని సాధారణంగా తీసుకోకూడదనుకున్నా. అందుకే స్పందించాను.

Rashmika – మనది గొప్పదేశం… అన్యాయం జరిగినప్పుడు అమ్మాయిలు నిర్భయంగా ముందుకు రావాలి

ఈ సందర్భంగా నేను అమ్మాయిలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏదైనా సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసి బాధిస్తే.. మీరు నిశ్శబ్దంగా ఉండొద్దు. కచ్చితంగా స్పందించండి. అప్పుడు మీకు ప్రజల మద్దతు లభిస్తుంది. మనం గొప్ప దేశంలో నివసిస్తున్నాం’ అని అన్నారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై మాట్లాడుతూ.. ‘నాకు ప్రతి విషయంలో చాలా సపోర్ట్‌ ఉంటుంది. ఇక నటీనటులు, క్రికెటర్లపై మీమ్స్‌, ట్రోల్స్‌ సర్వసాధారణం. అలాంటి వాటిని పట్టించుకోకూడదు’ అన్నారు.

ఇక ‘యానిమల్‌’ విషయానికొస్తే.. అర్జున్ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌-రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా డిసెంబరు 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది… చిత్ర యూనిట్ వినూత్న ప్రమోషన్, సర్ ప్రైజ్ అప్ డేట్స్ తో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో… ‘యానిమల్‌’ ట్రెండ్ కొనసాగుతోంది.

Also Read : Vishwak Sen: విశ్వక్‌సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా వాయిదా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com