కాంతార సినిమాతో మోస్ట్ పాపులర్ హీరోగా మారి పోయాడు రక్షిత్ శెట్టి. అయితే నేషనల్ క్రష్ గా మారి పోయిన రష్మిక మందన్నా తో తనకున్న ఫ్రెండ్ షిప్ అలాగే ఉందని పేర్కొన్నాడు. తాను ఇప్పటికీ టచ్ లోనే ఉన్నానని పేర్కొన్నాడు. కొందరు అనుకున్నట్లు తమ మధ్య దూరం ఏమీ లేదన్నాడు.
ఇదిలా ఉండగా అటు రక్షిత్ శెట్టి ఇటు రష్మిక మంచి స్నేహితులు. అంతే కాదు గతంలో లవర్స్ కూడా పెళ్లి దాకా వచ్చి ఆగి పోయింది వీరిద్దరి వ్యవహారం. అప్పట్లో ట్రోల్ కు కూడా గురైంది ఈ అందాల ముద్దుగుమ్మ. తాజాగా రక్షిత్ శెట్టి నటించిన కాంతార సెన్సేషన్ క్రియేట్ చేసింది. రికార్డుల మోత మోగించింది. కాసుల వర్షం కురిపించింది.
ఇదే సమయంలో రష్మికతో తన బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు రక్షిత్ శెట్టి. తామిద్దరం మంచి స్నేహితులమని స్పష్టం చేసింది . ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటామని పేర్కొన్నాడు. కొందరు పనిగట్టుకుని తామిద్దరి మధ్య దూరం ఉందంటూ ప్రచారం చేస్తున్నారంటూ వాపోయాడు నటుడు.
ఇక పుష్ప మూవీతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారి పోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారి పోయింది. విజయ్ దేవరకొండతో చనువుగా ఉంటోందన్న ప్రచారం జరిగింది.