Rashmika : సినిమా, క్రీడా, రాజకీయ రంగాలు ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి. బీజేపీ సర్కార్ కేంద్రంలో కొలువు తీరాక తారలు కూడా పార్టీల వారీగా చీలి పోయారు. తమకు కుల, మతం, ప్రాంతీయ విభేదాలు ఉండ కూడదని, కళ అనేది అందరి కోసమని కాకుండా కొందరికే పరిమితమై పోయిందన్న విమర్శలు లేక పోలేదు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) మందన్నపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే రవి గనిగ. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రత్యేకించి కన్నడ చలన చిత్ర పరిశ్రమను కుదిపేసింది.
Rashmika-MLA Ravi Issue Viral
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చు చేసి బెంగళూరు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. దీనిలో పాల్గొనేందుకు రావాల్సిందిగా తాము తమ ప్రాంతానికి చెందిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఆహ్వానించామని, అయితే తనకు కర్ణాటకలో ఇల్లు ఎక్కడ ఉందో తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని ఆరోపించారు. ఆమెను కన్నడ నాట నుంచి బహిష్కరిస్తామంటూ హెచ్చిరంచారు.
దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. మాజీ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రష్మిక మందన్న అంశంపై తీవ్రంగా స్పందించారు. కళాకారులకు ప్రాంతం అంటూ ఏమీ ఉండదన్నారు. తనకు ఎక్కడైనా ఉండేందుకు, బతికేందుకు రాజ్యాంగం హక్కు కల్పించిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ కావాలని రాజకీయం చేస్తోందని ఆరోపించారు. నిరభ్యంతరంగా తాము రష్మిక మందన్నాకు మద్దతుగా ఉంటామని ప్రకటించారు.
Also Read : Hero Allu Arjun-Atlee Movie :అల్లు అర్జున్ అట్లీ మూవీపై ఉత్కంఠ