Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోంది. జిమ్ చేస్తుండగా కాలుకు గాయమైంది. అలా గాయంతోనే తాను విక్కీ కౌశల్ తో కలిసి నటించిన ఛావా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్బంగా రిటైర్మెంట్ గురించి మాట్లాడింది. తను సంతోషంగా ఉన్నప్పుడే తప్పుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తనతో ఎక్కువ సినిమాలు తీసిన డైరెక్టర్ తో ఈ విషయం చెప్పానని పేర్కొంది.
Rashmika Intresting Comments
ప్రస్తుతం రష్మిక మందన్నా(Rashmika) చేసిన ఈ కామెంట్స్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప -2 మూవీ బాక్సులు బద్దలు కొట్టింది. ఏకంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 2200 కోట్లు కొల్లగొట్టింది.
ఇక మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఛాయా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్. ఇందులో శివాజీ భార్య ఏసుబాయి పాత్రలో నటిస్తోంది రష్మిక మందన్నా.
ఈ సందర్బంగా మాట్లాడుతూ నటీ నటులకు తమ కెరీర్ లో గొప్ప పాత్రలు అరుదుగా వస్తుంటాయన్నారు. ఈ చిత్రంలో తనకు శివాజీ భార్య పాత్ర దక్కడం దేవుడు ఇచ్చిన వరం అంటూ పేర్కొంది రష్మిక.
Also Read : Beauty Sai Pallavi : ‘ధ్యానం’ నా విజయ రహస్యం