Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినీ కెరీర్ గురించి విస్తు పోయేలా మాట్లాడారు. సినీ కెరీర్ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదన్నారు. ఇక్కడ బాగున్నప్పుడే పలకరింపులు ఉంటాయని, ఆ తర్వాత అలాంటివి ఏవీ ఉండవని పేర్కొన్నారు. ఒక రకంగా రంగుల లోకమని, దీనిపై ఎక్కువగా ఆధారపడితే ఇబ్బందులు ఏర్పడతాయనే అర్థం వచ్చేలా కామెంట్ చేయడం కలకలం రేపింది.
Rashmika Mandanna Comments
అంతే కాదు ప్రస్తుతం తను పాన్ ఇండియా హీరోయిన్ గా కొనసాగుతోంది. తను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప-2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాదు వరల్డ్ వైడ్ గా ఏకంగ ఆరూ. 2200 కోట్లకు పైగా కొల్ల గొట్టింది. ఈ నెలాఖరులో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్దమవుతోంది.
మరో వైపు విక్కీ కౌశల్ తో కలిసి ప్రసిద్ద మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఛాయా మూవీలో కీలకమైన పాత్రలో నటిస్తోంది. అంతే కాదు శివాజీ భార్య ఏసుబాయిగా ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. మరో వైపు సల్మాన్ ఖాన్ తో కలిసి దిగ్గజ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న సికిందర్ చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది.
చేతిలో భారీ సినిమాలు ఉన్నప్పటికీ వేదాంతం వల్లిస్తోంది ఈ అమ్మడు. బాగున్నప్పుడే రిటైర్ అయితే బెటర్ అంటూ పేర్కొంది.
Also Read : Hero Bunny-Pushpa 2 OTT : త్వరలో నెట్ ఫ్లిక్స్ లో పుష్ప-2 స్ట్రీమింగ్