ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో టేస్టు. ఈ మధ్య కాలంలో మూస ధోరణితో తీసే సినిమాలను జనం పట్టించు కోవడం లేదు. అంతే కాదు హీరో, హీరోయిన్లకు ఎంత పేరున్నా సినిమా అన్నది బాగో లేక పోతే పక్కన పెట్టేస్తున్నారు. సినిమా విడుదలైన రోజే హిట్టా ఫట్టా అని తేల్చేస్తున్నారు. గతంలో సినిమా సమీక్షలు ఆధారంగా ప్రేక్షకులు కొందరు వెళ్లే వారు. ఇప్పుడు వాళ్లే సమీక్షిస్తూ బాగుంటే ఓకే చెబుతున్నారు లేదంటే ఏకి పారేస్తున్నారు.
ఇదంతా సోషల్ మీడియా చేస్తున్న మాయాజాలం. దెబ్బకు దర్శక, నిర్మాతలు కేవలం వినోదం , రొమాన్స్ , భావోద్వేగాలు పలికించేలా కథలను తయారు చేస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా తీసి టాప్ లోకి వెళ్లి పోయాడు వంగా సందీప్ రెడ్డి. తను ప్రస్తుతం హిందీలో రణ బీర్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో యానిమల్ పేరుతో సినిమా తీశాడు.
ఇందుకు సంబంధించిన పోస్టర్స్ , టీజర్ దుమ్ము రేపుతోంది. అంతేకాదు తాజాగా విడుదల చేసిన సాంగ్ ఏకంగా యూత్ ను కిర్రాక్ తెప్పించేలా చేస్తోంది. భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నాడు వంగా సందీప్ రెడ్డి. తాజాగా విడుదల చేసిన సాంగ్ లో రణ్ బీర్, రష్మిక రెచ్చి పోయి నటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.