Rashmika Mandhanna : రష్మిక మందన్నా తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ప్రస్తుతం నటి వైరల్ గా మారారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు ప్రముఖ నటీమణులంతా ట్రోల్ కు గురవుతున్నారు. అన్నింటిని మార్ఫింగ్ చేస్తూ వీడియోలు , ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు.
Rashmika Mandhanna Comment
దీంతో టెక్నాలజీ పరంగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఏఐ ఎక్స్ పర్ట్స్ ప్రత్యేకించి పాపులర్ హీరోయిన్లను టార్గెట్ చేస్తుండడం ఒకింత విస్తు పోయేలా చేస్తోంది.
తాజాగా ఈ జాబితాలోకి చేరింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandhanna). తనకు సంబంధించి పూర్తి బోల్డ్ గా ఉన్న ఓ ఏఐ తో తయారు చేసిన ఫేక్ వీడియోను ఇంటర్నెట్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. సోషల్ మీడియాను షేక్ చేసింది.
వైరల్ గా మారిన తన మార్ఫింగ్ వీడియోపై రష్మిక మందన్నా స్పందించింది. ఇలా చేయడం మంచి పద్దతి కాదని వాపోయింది. ఇది తనకు సంబంధించింది కాదని, ఇదంతా ఫేక్ వీడియో అని పేర్కొంది. తాను ఇలాంటి పనులు ఎప్పుడూ చేయనంటూ పేర్కొంది.
విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం రష్మిక వంగా సందీప్ రెడ్డి తీస్తున్న యానిమల్ లో నటించింది. రణ బీర్ కపూర్ తో రెచ్చి పోయింది. ముద్దులతో ముంచెత్తింది. ఇదిలా ఉండగా ఇలాంటి వాటి నుంచి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది రష్మిక మందన్నా.
Also Read : Puja Hegde: రెడ్ శారీలో పిచ్చెక్కిస్తున్న డస్కీ బ్యూటీ