Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్న సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారారు. తను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లక్షలాది మంది ఫ్యాన్స్ ను కలిగి ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప , పుష్ప-2 మూవీ దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Rashmika Mandanna Comments
ఏకంగా పుష్ప-2 గత డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్బంగా ఏకంగా రూ. 2,200 కోట్లు వసూలు చేసి సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఈ సందర్బంగా ఇటీవల రష్మిక(Rashmika)మందన్న చిట్ చాట్ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. తాను రిలేషన్ లో ఉన్నానన్న విషయాన్ని ధ్రువీకరించింది.
అయితే గత కొంత కాలంగా విజయ్ దేవరకొండతో కలిసి ఉంటోంది. ఇద్దరూ ప్రేమలో కూరుకు పోయారని, చెట్టా పట్టాల్ వేసుకుంటూ జర్నీ చేస్తున్నారు. ఇదంతా అబద్దమని కొట్టి పారేసింది రష్మిక మందన్నా. సంబంధం నిజమే కానీ తనకు రౌడీ బాయ్ తో సంబంధం లేదంటూ హొయలు పోయింది.
మొత్తంగా ఇద్దరూ త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నారని, ఒక్కటి కావడం ఖాయమని తేలి పోయింది. కానీ రిలేషన్ లేదని చెప్పడంపై ఫ్యాన్స్ మండి పడుతున్నారు.