Chhaava : విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించిన ఛావా(Chhaava) కలెక్షన్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. వాలంటైన్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14న విడుదలైంది ఈ చిత్రం. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో కలెక్షన్స్ ఆశాజనకంగా మారాయి. ఛావాను మరాఠాలో చోటు చేసుకున్న యధార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించారు.
Chhaava Trending Collections
ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీశారు. శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ అల్లా రఖా రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించారు.
ఛావా మూవీ నాలుగు రోజులలో ఏకంగా రూ. 100 కోట్లను వసూలు చేసింది. ఇప్పటి వరకు రూ. 116.5 కోట్లు దాటేసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు ఛావా చిత్రానికి. ఆదివారం కావడంతో భారీ ఎత్తున కలెక్షన్స్ రావడం విశేషం. ఈ ఒక్క రోజే ఏకంగా ఛావాకు రూ. 48.5 కోట్లు వచ్చాయి. ఈ చిత్రం సినిమాల్లో 62.48 శాతం ఆక్కుపెన్సీ రేటు కలిగి ఉంది.
ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే 1వ రోజు రూ. 31 కోట్లు, 2వ రోజు రూ. 37 కోట్లు, 3వ రోజు రూ. 48.5 కోట్లతో మొత్తం రూ. 116.5 కోట్లకు పైగా సాధించింది. రాబోయే రోజుల్లో బ్రేక్ ఈవెన్ రావడం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : Beauty Sai Pallavi : తీరని కలగా మిగిలిన జాతీయ అవార్డు