Rashmika : సినీ రంగంలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. నటీ నటుల మధ్య డేటింగ్, ప్రేమ, రొమాన్స్, వివాహేతర సంబంధాలు కామన్ అయి పోయాయి. ఇందులో ఎవరు ఎప్పుడు కలుస్తారో ఇంకెప్పుడు విడిపోతారో ఎవరూ చెప్పలేరు. ఈ రంగమే అంత. స్థిమితం అంటూ ఉండదు. కొన్ని జంటలు తప్ప చాలా మంది హీరో హీరోయిన్లు వివాహం చేసుకున్నా చివరి దాకా ఉండలేక పోయారు. తాజాగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika), రౌడీగా పేరు పొందిన హీరో విజయ్ దేవరకొండ.
Rashmika Mandanna Dating with
ఈ ఇద్దరు చాలాసార్లు మీడియాకు చిక్కారు. ఆపై కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ మధ్యనే రష్మిక మందన్న చిట్ చాట్ చేస్తూ తనతో డేటింగ్ లో ఉన్నానంటూ నర్మ గర్భంగా చెప్పింది. అయితే తన పుట్టిన రోజు ఏప్రిల్ 5న శనివారం. దీంతో ఇదే కరెక్ట్ సమయం అని, తామిద్దరం ఒక్కటి కాబోతున్నట్లు ప్రకటించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ట్రెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు నేషనల్ క్రష్.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ బాగా పండింది పరుశురామ్ తీసిన గీత గోవిందం. ఇది బాక్సులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో కలిసి నటించారు. చాలా సంవత్సరాలుగా ఈ ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిని దేవరకొండ కానీ రష్మిక కానీ ఖండించ లేదు. ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షరతులు లేని ప్రేమ గురించి తెలియదన్నారు. నా ఏజ్ 35 ఏళ్లు..నేను ఒంటరిగా ఉంటానని మీరు ఎలా అనుకుంటారంటూ ప్రశ్నించాడు దేవరకొండ. మొత్తంగా పెళ్లికి రెడీ అవుతున్నారంటూ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
Also Read : Anchor Pradeep Sensational : ఎమ్మెల్యేతో పెళ్లిపై స్పందించిన ప్రదీప్