Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ కలిసి నటించిన ఛావా చిత్రం ప్రపంచ ప్రేమికుల పండుగ రోజు ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో మునిగి పోయింది. ఛావా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు.
Rashmika-Vicky Kaushal Sensation at..
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ నిజ జీవిత కథ ఆధారంగా తీశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ , సాంగ్స్ , పోస్టర్స్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. ఈ అద్భుతమైన సినిమాకు ప్రాణం పోశాడు తన సంగీతంతో అల్లా రఖా రెహమాన్.
ప్రమోషన్స్ లో భాగంగా తళుక్కున మెరిశారు రష్మిక మందన్నా(Rashmika), విక్కీ కౌశల్. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ది చెందిన దేవాలయమైన పంజాబ్ లో కొలువు తీరిన అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఇద్దరూ సందడి చేశారు. భక్తులు, జనం వీరిని చూసేందుకు ఎగబడ్డారు. కానీ ఎక్కడా భేషజాలు ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఆలయాన్ని సందర్శించారు. ప్రార్థనలు చేశారు.
నటుడు విక్కీ కౌశల్ తెల్లని కుర్తాలో దర్శనం ఇవ్వగా , లవ్లీ బ్యూటీ రష్మిక మందన్నా పింక్ సూట్ తో కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఛాయ చిత్రంలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో నటించింది రష్మిక మందన్నా. ఈ పాత్ర దొరకడం దేవుడు ఇచ్చిన వరం అని పేర్కొంది.
Also Read : Chiranjeevi Sensational :మా తాత మంచి రసికుడు – చిరంజీవి