Rashmika Mandanna: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న తాజా సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా గడుపుతోంది. ఇటీవల హోలీ పండుగను పురస్కరించుకుని… ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ ‘మధురము కదా..’ అనే లవ్ సాంగ్‌ను విడుదల చేయడంతో పాటు… విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తో పాటు చిత్ర యూనిటిల్ అభిమానుల మధ్య హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనితో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ సినిమాకు బెస్ట్ విషెస్ చెప్తూ ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Rashmika Mandanna Wishes Viral
తన స్నేహితుడు విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ పెద్ద విజయం అందుకోవాలని సోషల్ మీడియా వేదికగా టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియచేసింది నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna). “ఏప్రిల్ 5 కోసం నేను ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నా, నాకు ఇష్టమైన విజయ్, పరశురామ్ ల ఫ్యామిలీ స్టార్ తప్పకుండా విజయం అందుకుంటుందని… నాకు పార్టీ కావాలంటూ ప్రత్యేకంగా హీరోయిన్ మృణాల్ కి విషెస్ చేస్తూ రష్మిక ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గీతగోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాల్లో కలిసి నటించిన రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య ప్రేమయాణం సాగుతోందని ప్రచారం జరుగుతోంది. స్నేహితులుగా చెప్పుకునే వీరిద్దరూ తరచూ విదేశాల్లో ఎంజాయ్ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తన స్నేహితుడి సినిమా కోసం బెస్ట్ విషెస్ చెప్పడం ఆశక్తికరంగా మారింది.
Also Read : Heeramandi: సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’