Rashmika Mandanna : కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో సినిమా కెరీర్ ను ప్రారంభించిన రష్మిక మందన్న ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది. భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే వరుసగా సినిమాలకు ఓకే చెబుతోంది. రష్మిక(Rashmika Mandanna) నటించిన మూడు హిందీ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇందులో యానిమల్ ఏకంగా 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఇప్పుడు ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తాజాగా మరో కొత్త హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రష్మిక. కాగా ఆమె నటించిన ‘చావా’ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. శివాజీ కొడుకు కథతో తెరకెక్కిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలోనూ రష్మిక మందన్నా(Rashmika Mandanna)నే హీరోయిన్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టైగర్ ష్రాఫ్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా శర వేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న మరో బాలీవుడ్ యంగ్ స్టార్ నటుడి సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపింది.
Rashmika Mandanna Movies Update..
‘అంధాధున్’, ‘బడాయి హో’, ‘ఆర్టికల్ 15’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో వైవిధ్యమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఇప్పుడు అతను నటిస్తున్న కొత్త హారర్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమా వాంపైర్ తరహా హారర్ మూవీ అని తెలుస్తోంది. మరో ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఈ సినిమాలో నటించనున్నాడు. విజయనగర సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ ను హంపిలో చిత్రీకరించనున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా ఒక భాగం ప్రస్తుత కాలంలో, రెండో భాగంలో విజయనగర సామ్రాజ్యం నాటి కథాంశంతో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘తంబ’ అనే పేరు పెట్టారు. ఇటీవల బాలీవుడ్‌లో హారర్ కామెడీ సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ‘ తాంబ’ కూడా అదే జోనర్‌కి చెందిన సినిమా. ఇటీవల ‘ముంజ్యా’ సినిమాతో పెద్ద హిట్‌ని అందించిన దర్శకుడు ఆదిత్య ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read : Jani Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు షాక్ ఇచ్చిన పుష్ప 2 నిర్మాతలు