Rashmika Mandanna : రష్మికను తెగ ఇబ్బంది పెడుతున్న పుష్ప టీమ్

తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టార్ ద్వారా ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు...

Hello Telugu- Rashmika Mandanna

Rashmika Mandanna : గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ అనే తేడాలు లేకుండా ‘పుష్ప 2’ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే చెన్నై ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రొడ్యూసర్స్ తీరుపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేయడం చూశాం. అయితే పుష్ప మేకర్స్ దేవినే కాదు శ్రీవల్లిని కూడా బాధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రష్మిక(Rashmika Mandanna)నే తెలియజేసింది.

Rashmika Mandanna Insta Post..

తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టార్ ద్వారా ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు. ‘‘డియర్‌ డైరీ.. నవంబరు 25 నా జీవితంలో ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న రోజు. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. 24వ తేదీ సాయంత్రం మేమంతా షూట్‌ పూర్తి చేసుకొని చెన్నైలో ఈవెంట్‌కు హాజరయ్యాం. అదేరోజు తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాం. ఇంటికి వెళ్లి దాదాపు నాలుగు గంటలు నిద్రపోయా. ఉదయాన్నే నిద్ర లేచి ‘పుష్ప’ షూట్‌కు పరుగులు పెట్టా.

ఈ సినిమాకు ఇదే నా ఆఖరి రోజు షూట్‌. స్పెషల్‌ సాంగ్‌ షూట్ చేశాం. రాత్రి వరకూ సెట్‌లోనే ఉన్నా. ఇది ఆఖరిరోజులా ఏమాత్రం నాకు అనిపించలేదు. గత ఐదేళ్లు ఈ సినిమా సెట్‌లోనే గడిపా. ఇది నాకొక ఇల్లులా మారింది. ఇప్పటివరకూ పడిన కష్టం, నీరసించిన క్షణాలు.. చివరిరోజు కావడంతో అన్నీ నా కళ్ల ముందు మెదిలాయి. ఓవైపు ఆనందం, మరోవైపు టీమ్‌, సెట్‌ని వీడుతున్నాననే బాధ.. ఇలా అన్నిరకాల భావోద్వేగాలతో నా మనసు నిండింది. ఈ సినిమా కోసం వర్క్‌ చేసిన ప్రతిఒక్కరిని ఇకపై మిస్‌ అవుతా. ఎంతోకాలం తర్వాత బాధతో బాగా ఏడ్చేశా. నేనెందుకు ఆవిధంగా రియాక్ట్‌ అయ్యానో అర్థం కాలేదు’’ అంటూ ఆమె బాధపడ్డారు. ఈ విధంగా పుష్ప టీమ్ ఆమెని బాధ పెట్టేసింది.

Also Read : Priyanka Jain : తిరుమలలో ఏంటి ఇలాంటి పనులు అంటూ భగ్గుమంటున్న నెటిజన్లు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com