తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ఛాలెంజ్ గా తీసుకుని నటించిన చిత్రం కింగ్ డమ్. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ వెర్షన్ లలో అద్బుతమైన ఆదరణ పొందింది. టీజర్ ను అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ సందర్బంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న స్పందించింది. కింగ్ డమ్ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చింది.
విజయ దేవరకొండను చూస్తే తనకు గర్వంగా ఉందంటూ పేర్కొంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించి కింగ్ డమ్ పోస్టర్ ను కూడా చేర్చింది. సింప్లీ సూపర్ , వండర్ ఫుల్ అంటూ పేర్కొంది రష్మిక మందన్న.
అంతే కాదు రౌడీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు లవ్లీ బ్యూటీ. ఈ మనిషి ఎప్పుడూ ఇంతే..ఏదో ఒక మానసిక స్థితితో ముందుకు వస్తాడంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ రష్మికా థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చాడు.
ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచి రష్మిక మందన్నా, విజయ్ కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిని ఈ ఇద్దరూ ఖండించ లేదు..అలా అని తిరస్కరించ లేదు. మరో వైపు నేషనల్ బ్యూటీ రష్మిక మందన్న నటించిన హిందీ చారిత్రిక నేపథ్యంలో తీసిన ఛాయ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. తను హీరో విక్కీతో కలిసి స్వర్ణ దేవాలయాన్ని సందర్శించింది.