Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి సంచలనంగా మారారు. ఈ అమ్మడు పుట్టిన రోజు ఈ నెలలోనే. ఏప్రిల్ 5న కర్ణాటకలో పుట్టింది. తనకు 28 ఏళ్లు పూర్తవుతాయి 29వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. అత్యంత జనాదరణ పొందిన నటిగా గుర్తింపు పొందింది. దేశ వ్యాప్తంగా రష్మిక మందన్నా(Rashmika) గురించి చర్చ జరుగుతోంది. రేపటి బర్త్ డే కోసం ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున కంగ్రాట్స్ తెలియ చేస్తున్నారు. తనకు ఇన్నేళ్లు వచ్చాయంటే నమ్మలే పోతున్నానని పేర్కొంది.
Rashmika Mandanna Comment
తను 1996లో నీరజ్ పేటలో పుట్టింది. నటిగా, ప్రచారకర్తగా పేరొందారు. తన సినీ జీవితం 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ చలన చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఇదే సమయంలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఛలో మూవీతో. పరుశురామ్ దర్శకత్వంలో రౌడీ విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం చిత్రంలో నటించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది..మెప్పించింది. ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ లవ్లీ బ్యూటీ.
ఇదే సమయంలో దమ్మున్న డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-1, పుష్ప-2 చిత్రాలలో కీ రోల్ పోషించింది. ఈ రెండు సినిమాలతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా నేషనల్ క్రష్ గా మారి పోయింది రష్మిక మందన్నా. హిందీలో రణ్ బీర్ కపూర్ తో వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో యానిమల్ లో నటించింది. రూ. 1000 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మరాఠా యోధుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తీసిన ఛావాలో తన భార్యగా నటించింది. ఇది రూ. 500 కోట్లు సాధించింది. సల్మాన్ తో సికిందర్ లో నటించినా ఆశించినా వర్కవుట్ కాలేదు. అయినా ఎక్కడా తన స్టార్ ఇమేజ్ తగ్గలేదు.
Also Read : Hero Nani Hit-3-Karthi :నేచురల్ స్టార్ మూవీలో నటించనున్న కార్తీ