Rashmika : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత కొంత కాలంగా తాను రిలేషన్ షిప్ లో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది. ఇటీవలే తన ఇంట్లో జిమ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఉన్నట్టుండి కాలు బెణికింది. దీంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోంది.
Rashmika Mandanna Comment About Dating
తను బన్నీతో కలిసి నటించిన పుష్ప-2 దుమ్ము రేపింది. వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 2200 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇదే సమయంలో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ హిందీలో సల్మాన్ ఖాన్ తో తీస్తున్న సికిందర్ చిత్రంలో కూడా తను కీ రోల్ పోషిస్తోంది.
ఓ వైపు తెలుగు మరో వైపు హిందీ చిత్రాలలో బిజీగా ఉన్న రష్మిక మందన్న ఉన్నట్టుండి డేటింగ్ గురించి నోరు విప్పింది. చిట్ చాట్ సందర్బంగా ఓపెన్ అయ్యింది. తన ఫ్యాన్స్ కు ఖుష్ కబర్ చెప్పింది. అవును ..తాను రిలేషన్ లో ఉన్నట్లు స్పష్టం చేసింది.
అయితే తన బాయ్ ఫ్రెండ్ ఎవరు అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేనంటూ పేర్కొంది. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానంటూ అంత వరకు వేచి చూడాలంటూ సస్పెన్ష్ లో పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. నా సామి అంటూ కుర్రకారును పిచ్చెక్కించేలా చేసింది రష్మిక మందన్న.
Also Read : Beauty Kriti-Dhanush : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కన్ ఫర్మ్