Rashmika Mandanna: పుష్ప, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా లెవల్ లో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అరుదైన ఘనత సాధించింది. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో రష్మిక స్థానం సంపాదించుకుంది. ఏటా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేస్తుంది. 30 ఏళ్ల వయసు లోపున్న 30 మంది ప్రతిభావంతుల జాబితాను తాజాగా ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. వీరిలో యువ వ్యాపార వేత్తలు, ఆవిష్కరణ కర్తలు, క్రీడాకారులు, సంగీతం, ఆర్థిక, మీడియా, న్యాయ, వినోదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్యాషన్ ఇలా పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారు ఉన్నారు. ఈ జాబితాలో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ కృతజ్ఞత చెప్పింది. దీనితో రష్మికకు సినీప్రముఖులు, అభిమానుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కంగ్రాట్స్ గీతాంజలి, శ్రీవల్లి అంటూ యానిమల్, పుష్ఫ సినిమాల అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Rashmika Mandanna Viral
ఇటీవల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ సరసన ‘యానిమల్’ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన రష్మిక(Rashmika Mandanna)… ప్రస్తుతం ఆమె ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్ లో బిజీగా ఉంది. గతంలో సోషల్ మీడియాలో ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్న వారిలో రష్మిక పేరు టాప్ లిస్టులో నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈసారి వివిధ రంగాల యువతతో పోటీపడుతూ ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో స్థానం సంపాదించి తన ఖ్యాతిని మరింత పెంచుకుంది. ఈ ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించుకున్న సినిమా, గ్లామర్ ఇండస్ట్రీలకు సంబంధించిన విరాజ్ ఖన్నా (నటుడు), రాధికా మదన్ (నటి), అనుష్క రాఠోడ్ (డిజిటల్ కంటెంట్ క్రియేటర్), దీప్‌రాజ్ జాదవ్ (డిజిటల్ కంటెంట్ క్రియేటర్) కూడా ఉన్నారు.
Also Read : Dil Raju Dance: ఘనంగా టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి !