Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక చాలా బిజీగా మారిపోయింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఈ చిన్నది. ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్స్ లో రష్మిక ఒకరు. కన్నడ భాషలో ముందుగా సినిమాలు చేసిన ఈ చిన్నది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది. ‘యానిమల్’ సినిమాలో చాలా బోల్డ్‌గా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో బిజీగా మారిపోయింది ఈ అమ్మడు. మరో 10 నెలల్లో రష్మిక(Rashmika Mandanna) నటించిన 5 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం..!
Rashmika Mandanna Movies Update
రష్మిక మందన్న 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కేవలం 8 ఏళ్లలో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. స్టార్ హీరోలతో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ అమ్మడు. రష్మిక(Rashmika Mandanna) సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి.సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప 2’ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమాపై రష్మిక ఆశలు పెట్టుకున్నారు.అలాగే ‘చావా’ అనే హిందీ సినిమా డిసెంబర్ 6న విడుదలవుతోంది. ఇందులో రష్మిక ఓ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ భార్య పాత్రలో రష్మిక కనిపించనుంది.
అలాగే‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమాలో నటిస్తోంది ఈ భామ. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ పూర్తిగా రష్మిక చుట్టూనే తిరుగుతుంది. వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు రష్మిక మందన్న ‘సిఖందర్’లో సల్మాన్ ఖాన్‌తో జతకట్టింది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2025 ఈద్‌కు విడుదల కానుంది. ఇది కాకుండా స్టార్ హీరోలు ధనుష్, నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. కాగా రష్మిక ‘రెయిన్బో’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక దశ షూటింగ్ పూర్తయింది. ఇలా రష్మిక నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి.
Also Read : Samantha : అమ్మతనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత