Rashmika Mandanna : వాయనాడ్ బాధితులకు అండగా ఉంటాం ధైర్యంగా ఉండండి..

ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆమె పేర్కొంది...

Hello Telugu - Rashmika Mandanna

Rashmika Mandanna : కష్టం అంటే సాయం అందించడానికి ముందుంటారు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న. మరోసారి ఆమె తన మంచి మనసు చాటుకుంది. కేరళ వయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాదం పట్ల రష్మిక మందన్న స్పందించారు. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం రూ10 లక్షల రూపాయలను విరాళం ప్రకటించారు.

Rashmika Mandanna Comment

ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆమె పేర్కొంది. గతంలో కేరళలో వరదలు సంభవించిన సమయంలో కూడా రష్మిక తనవంతు సాయం అందించారు. ఈ ఏడాది యానిమల్‌ చిత్రంతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్న ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ‘పుష్ఫ-2’ షూటింగ్‌తో బిజీగా ఉంది. దీనితో పాటు ‘రెయిన్ బో’, ‘ద గర్ల్‌ఫ్రెండ్‌’, ‘కుబేర’, ‘సికందర్‌’ చిత్రాలు చేస్తోంది.

Also Read : Hero Prabhas : సుభాష్ చంద్రబోస్ గా తెరపై కనిపించనున్న డార్లింగ్ ప్రభాస్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com