Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తను అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప-2 దుమ్ము రేపింది. భారీ ఎత్తున కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ. 2,000 కోట్లకు పైగా వసూలు సాధించి సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
Rashmika-Salman Khan Movie..
తను పుష్ప తో పాటు సీక్వెల్ మూవీలో కీలక పాత్ర పోషించింది. సామి సామి అంటూ కుర్రకారు గుండెలను మీటింది. బన్నీతో పాటు నువ్వా నేనా అంటూ పోటీ పడింది. ఇచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేకూర్చే నటిగా గుర్తింపు పొందింది.
అంతే కాకు పాన్ ఇండియా లెవల్లో నేషనల్ క్రష్ గా మారి పోయింది రష్మిక మందన్నా(Rashmika). తను ప్రస్తుతం ఓ హిందీ మూవీలో బిజీగా ఉంది. ఇటీవలే తన ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కాలు బెణికింది. ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. మరో వైపు టాప్ తమిళ డైరెక్టర్ మురుగదాస్ హిందీ మూవీ చేస్తోంది. ఇందులో సల్మాన్ ఖాన్ తో సికిందర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం రష్మిక మందన్నా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బిజీగా మారి పోయింది. ఇప్పటికే సికిందర్ తో జత కట్టిన ఈ బ్యూటీ మరో సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. మరో కోలీవుడ్ కు చెందిన స్టార్ డైరెక్టర్ అట్లీ సల్మాన్ ఖాన్ తో మూవీ సినిమా తీయ బోతున్నాడు. ఇందుకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చాడు. తన కొత్త సినిమాలో రష్మిక మందన్నాను బుక్ చేశాడు.
Also Read : Prabhas Spirit Role : డార్లింగ్ ప్రభాస్ పోలీస్ బాస్