Rashmika Mandanna: ఆనంద్ దేవరకొండపై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

ఆనంద్ దేవరకొండపై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

Hello Telugu - Rashmika Mandanna

Rashmika Mandanna: రష్మిక పేరు చెప్పగానే చాలామందికి విజయ్ దేవరకొండనే గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ ఫ్రెండ్సా ? లవర్సా ? అనేది ఇప్పటికీ సస్పెన్సే. ఈ జంట పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా రష్మిక(Rashmika Mandanna)… విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో పాల్గొంది. విజయ్‌ తో బాండింగ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది.

Rashmika Mandanna Comment

ఆనంద్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు ఉదయ్‌ బొమ్మిశెట్టి తెరకెక్కించిన ‘గం. గం.. గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్లు. ఈ నెల 31న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా హైదరాబాద్‍‌ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రష్మికని… ఆనంద్ దేవరకొండ చాలా ప్రశ్నలు అడిగాడు. రీసెంట్‌గా రష్మిక పోస్ట్ చేసిన పెట్ డాగ్స్ ఫొటోలు చూపించి, వీటిలో ఏదంటే నీకు బాగా ఇష్టమని అడిగాడు. దీనితో ఆరా (రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్టార్మ్ (విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పింది.

నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని రష్మిక(Rashmika Mandanna)ని ఆనంద్ అడగ్గా… మైక్ పక్కకు పెట్టి నీ యబ్బ అని ఆనంద్‌ ని సరదాగా తిట్టింది. ఆ వెంటనే మైక్ లో… ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా ఇరకాటంలో పెడితే ఎలా అని అనడంతో ఈవెంట్‌కి వచ్చిన వాళ్లందరూ రౌడీ, రౌడీ స్టార్ అని అరిచారు. దీనితో రౌడీ బాయ్ నా ఫేవరేట్ అని విజయ్‌ ని ఉద్దేశించి రష్మిక చెప్పింది. ఇలా రష్మిక-విజయ్ ఎంత క్లోజ్ అనేది మరోసారి ప్రూవ్ అయింది.

 

ఆనంద్‌ అడిగిన పలు ప్రశ్నలకు రష్మిక చెప్పిన సమాధానాలు

ఆనంద్‌: మీకు బాగా ఇష్టమైన టూరిస్ట్‌ ప్లేస్‌?
రష్మిక: వియత్నాం

ఆనంద్‌: మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరెట్‌?

రష్మిక: ఆనంద్‌.. నువ్వు నా ఫ్యామిలీ ఇలా ఇరికిస్తే ఎలా? అంటూనే రౌడీ బాయ్‌ (విజయ్‌ దేవరకొండ) అని తెలిపారు.

ఆనంద్‌: మా చిత్రంలో గణేశుడిది కీలక పాత్ర. ఆయన గురించి మీరేం చెబుతారు..

రష్మిక: నేను దేవుణ్ని నమ్ముతా. పూజలు ఎక్కువగా చేస్తుంటా. వినాయక చవితి ఎప్పుడూ ప్రత్యేకమే.

ఆనంద్‌: మీ ఫ్రెండ్స్‌లో బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌ ఎవరు?

రష్మిక: నేనే. నీ ఫొటో కూడా తీశా. కానీ, ఎవరూ క్రెడిట్‌ ఇవ్వలేదు.

Also Read : Deepika Padukone : 20 నిమిషాల్లో సోల్డ్ అవుట్ అయిన దీపికా పదుకోన్ గౌన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com