Rashmika : కన్నడ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఛలో సినిమాతో టాలీవుడ్ కి వచ్చిన ఈ భామ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. కేవలం కొన్ని సినిమాలతోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పాన్ ఇండియన్ స్టార్ తెలుగు సినిమాల్లో కూడా హీరోయిన్‌గా మారింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది.
Rashmika Movies
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఈ చిన్నారి. రీసెంట్ గా యానిమల్ సినిమాతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీకి అన్ని భాషల్లోనూ క్రేజీ పెరిగింది. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ఈ స్టార్ ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. ఇప్పుడు, ఈ భామ పారితోషకం గణనీయంగా పెంచినట్లు తెలుస్తోంది.
రష్మిక ప్రస్తుతం పుష్ప 2తో పాటు సల్మాన్ ఖాన్ నటిస్తున్న హిందీ చిత్రం సికిందర్‌లో నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్ సినిమాలో నటించినందుకు రష్మిక మందన్న రూ.15 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Fahadh Faasil : మరో స్టార్ హీరో సినిమాలో విలన్ పాత్రలో రానున్న షెకావత్