Ranya Rao : కర్ణాటక – గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. తను 17 బంగారు కడ్డీలు తీసుకు వచ్చానని తెలిపింది. వీటిని యూరప్ , అమెరికా, మిడిల్ ఈస్ట్ లకు వెళ్లానని చెప్పింది. అధికారులకు ఇచ్చిన సమాధానంలో కీలక అంశాలు వెల్లడించింది. దుబాయ్, సౌదీ అరేబియాకు ఎక్కువసార్లు వెళ్లాల్సి వచ్చిందన్నారు. నాకు విశ్రాంతి లేకుండా పోయిందని, ప్రస్తుతం తనకు రెస్ట్ అవసరమని చెప్పినట్లు సమాచారం.
Ranya Rao Shocking Comments
ఇదిలా ఉండగా గత ఏడాది 2024లో నటి రన్యా రావు(Ranya Rao) బెంగళూరు నుంచి దుబాయ్ కి ఏకంగా 27 సార్లు వెళ్లిందని డీఆర్ఐ విచారణలో తేలింది. దీనిపై పూర్తి నిఘా ఉంచారు. మొన్న తను ఫ్లైట్ దిగిన వెంటనే తనిఖీలు చేపట్టారు. భారీ ఎత్తున తన వద్ద నుంచి బంగారం దొరికింది. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 14.8 కేజీల బంగారం లభించిందని వెల్లడించారు. వీటిని స్వాధీనం చేసుకుని రన్యా రావును కోర్టులో హాజరు పర్చారు. ఆమెకు ధర్మాసనం కస్టడీ విధించింది.
డీఆర్ఐ అధికారుల విచారణలో తన కుటుంబ వివరాలను వెల్లడించింది. తన తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి కేఎస్ హెగ్డేష్ అని, భర్త జతిన్ హుక్కేరి అని, బెంగళూరులో తనతో పాటు నివసిస్తున్న ఆర్కిటెక్ట్ అని చెప్పింది. ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీఐజీ రామచంద్రరావు రన్యా రావు సవతి తండ్రి. 2014లో తను కిచ్చా సుదీప్ నటించిన మాణిక్య చిత్రంలో నటించింది. తనకు 33 ఏళ్లు.
Also Read : Actress Ramya Shocking : రెమ్యునరేషన్ పై రమ్య షాకింగ్ కామెంట్స్