Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ వరుస సినిమాలతో జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగమ్ అగైన్’ తో సంగ్రామ్ భలేరావ్ గా అలరించేందుకు సిద్ధమవుతున్న… ఈ మల్టీ ట్యాలెంటెడ్ హీరో తరువాత డాన్ 3 లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే డాన్ 3 సినిమా షూటింగ్ కంటే మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
Ranveer Singh Movie Updates
‘సింగమ్ అగైన్’ షూటింగ్ పూర్తయ్యాక అదిత్య ధర్ తో ఓ సినిమాని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దానికి ‘ధురంధర్’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు బీ టౌన్ వర్గాల సమాచారం. ‘ఆధిత్య ధర్, రణ్ వీర్ సింగ్ కలయికలో రానున్న తొలి చిత్రం కాబట్టి చిత్రబృందం ఈ సినిమాని ఎంతో ప్రత్యేకంగా తెరకెక్కించనున్నారు నిర్మాతలు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ని రాజకీయాలు, గ్యాంగ్‌వార్ నేపథ్యంలో రూపొందించనున్నారు. జూన్‌లో దీని చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు’ అని సన్నిహితవర్గాల సమాచారం.
Also Read : Sonakshi Sinha: మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా !