Rani Mukerji : బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి పీరియాడికల్ స్టోరీ నేపథ్యంతో తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వంభర. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిస్తే కొరటాల శివ తీసిన ఆచార్య ఆశించిన మేర ఆడలేదు.
Rani Mukerji Screen Sharing with Megastar
ప్రస్తుతం చిరంజీవి ఫుల్ ఫోకస్ పెట్టారు విశ్వంభరపై. మరో వైపు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి పని చేయనున్నారు ఈ మూవీ షూటింగ్ అయి పోయాక. ఈ ఏడాది ఫుల్ బిజీగా మారి పోయారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. ఏళ్లు గడిచినా సూపర్ స్టార్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ తో పోటీ పడుతూ దూసుకు పోతున్నారు.
మరో వైపు సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హ్యాట్రిక్ బిగ్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి చెప్పిన కథకు ఓకే చెప్పారు మెగాస్టార్. దీంతో మరింత నవ్వులు పూయించేందుకు రెడీ అయ్యారు. సెన్సాఫ్ ఆఫ్ హ్యూమర్ పండించడంలో తనకు తనే సాటి. గతంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు.
తాజాగా విశ్వంభర సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్ మెగాస్టార్ పక్కన నటించనుందని. ఆమె ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ రాణీ ముఖర్జీ(Rani Mukerji). ఇప్పటికే తన పాత్రకు సంబంధించి తనతో చర్చలు జరిపారని, తను కూడా మెగాస్టార్ తో స్టెప్పులు వేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మూవీ మేకర్స్.
Also Read : Beauty Shruti Haasan :స్వంతంగా ఎదగాలని పేరు మార్చుకున్నా