Ranbir Kapoor: అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లుగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ‘యానిమల్’. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 1న విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించింది. దీనితో తొలి రోజు కలెక్షన్ల పరంగా ఈ సినిమా హీరో రణ్ బీర్ కపూర్(Ranbir Kapoor) కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా… బాలీవుడ్ లో ‘జవాన్’, ‘పఠాన్’ల తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
Ranbir Kapoor – ఫస్ట్ డే రూ. 116 కోట్లు వసూలు చేసిన ‘యానిమల్’
భారీ అంచనాల మధ్య విడుదలైన ‘యానిమల్’ సినిమా పాజిటివ్ టాక్‌ను అందుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. రణ్ బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే హవా చూపిన ఈ చిత్రం మొదటి రోజు వందకోట్ల మార్క్‌ను సులువుగా చేరుకుంది. ఫస్ట్‌డే ప్రపంచ వ్యాప్తంగా రూ.116కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది.
భారత్‌లో రూ.55 కోట్లు రాబట్టగా… ఈ ఏడాది విడుదలైన ‘జవాన్’, ‘పఠాన్’ల తర్వాత మూడో స్థానంలో నిలిచింది. ఈ వీకెండ్‌కు కలెక్షన్ల జోరు పెరిగి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు 200కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ సినిమాగా రూపొందిన ఈ మూవీ ఆ మార్క్‌ను చాలా సులువుగా అందుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా. దీనితో సందీప్ వంగా గత సినిమా ‘కబీర్ సింగ్’ రికార్డులను బద్దలు కొడుతుందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు అంటున్నారు.
Also Read : Allu Arjun: పుష్ప- 2 షూటింగ్‌కు బ్రేక్… కారణం అదేనా !