కోహ్లీ బయోపిక్ పై రణబీర్ ఆశక్తిక వ్యాఖ్యలు
Ranabir Kapur : ఐసిసి వరల్డ్ కప్-2023 తొలి సెమీ ఫైనల్ లో సెంచరీ చేయడం ద్వారా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ అత్యధిక (49) వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ పై బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్(Ranabir Kapur) ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. కింగ్ కోహ్లీ జీవిత కధ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తే అందులో కోహ్లీ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందో తన మనసులో మాటను బయటపెట్టారు. బుధవారం ముంబై వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ కు హాజరయి సందడి చేసిన రణ్ బీర్… గురువారం తన తాజా చిత్రం ‘యానిమల్’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ బయోపిక్‌లో మీరు నటించాలనుకొంటున్నారా? అని సినిమా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు రణ్‌బీర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ‘విరాట్ కోహ్లీ జీవితాన్ని సినిమాగా తీస్తే.. అందులో అతడే నటించాలి. ఎందుకంటే అతడు చాలామంది నటుల కంటే అందంగా కనిపిస్తాడు. అలాగే చాలా ఫిట్‌గా కూడా ఉంటాడు. కాబట్టి ఆ పాత్రకు కోహ్లీనే కరెక్ట్’’ అని రణ్‌బీర్ అన్నారు. దీనితో కోహ్లీ బయోపిక్ పై రణ్ బీర్ కపూర్(Ranabir Kapur) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను పెళ్ళి చేసుకున్న విరాట్ కోహ్లీ, ఇప్పటికే చాలా కమర్షియల్ యాడ్స్ లో నటించారు. అవకాశం వస్తే చాలు క్రికెట్ గ్రౌండ్ అని చూడకుండా డ్యాన్సులు కూడా చేస్తుంటాడు. దీనితో విరాట్ కోహ్లీ హీరోయిజంపై ఎవరికీ అనుమానం లేకపోయినప్పటికీ… బయోపిక్ లో ఒరిజినల్ క్యారెక్టర్ కాకుండా వేరొక హీరో నటిస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Ranabir Kapur – కోహ్లీ బయోపిక్ పై రామ్ చరణ్ ఆశక్తి ?
కోహ్లీ బయోపిక్ గురించి వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. బాలీవుడ్ కు చెందిన బడా నిర్మాణ సంస్థ కోహ్లీ బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేస్తుందంటూ గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాదు, అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నాని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై అప్పట్లో స్పందించిన రామ్ చరణ్… ‘కోహ్లీ నాకు చాలా ఇష్టమైన క్రికెటర్. అతడు ఎంతో మందికి స్ఫూర్తి. నాకు తన పాత్ర పోషించే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తా. అది అద్భుతంగా ఉంటుంది’’ అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో రణ్ బీర్ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
డిసెంబరు 1 న ‘యానిమల్’
అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రణ్ బీర్ కపూర్(Ranabir Kapur), అనిల్ కపూర్, బాబే డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. T-సిరీస్ మరియు సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 11 ఆగస్టు 2023న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ విస్తృతమైన పోస్ట్-ప్రొడక్షన్ పనుల కారణంగా డిసెంబర్ 1, 2023కి వాయిదా వేసారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్ ను చిత్ర యూనిట్ షురూ చేసారు.
Also Read : Rekhabojo: స్ట్రీకింగ్ కు సిద్ధమంటున్న తెలుగు హీరోయిన్