Rana Naidu: వెబ్ సిరీస్ లో ‘రానా నాయుడు’ రికార్డు

వెబ్ సిరీస్ లో ‘రానా నాయుడు’ రికార్డు

Hello Telugu - Rana Naidu

Rana Naidu: కోవిడ్-19 పాండమిక్ తరువాత ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. దీనితో స్టార్ హీరోహీరోయిన్లు సైతం సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. దీనికి మాస్, క్లాస్, థ్రిల్లర్, క్రైమ్, సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్న వారు అని తేడా లేకుండా వెబ్ సిరీస్ లపై ఆశక్తి చూపిస్తున్నారు. దీనిలో భాగంగా ప్యామిలీ ఆడియన్స్ కు దగ్గరగా ఉండే విక్టరీ వెంకటేష్, తన సోదరుడు సురేష్ బాబు కుమారుడు రానాతో కలిసి ‘రానా నాయుడు(Rana Naidu)’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ సిరీస్‌ రిలీజ్ తొలి రోజుల్లో వివాదాల్లో నిలిచినప్పటికీ… ఆ తరువాత బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఓ అరుదైన ఘనత సాధించింది. ఇండియాలో ఏ వెబ్ సిరీస్ సాధించని ఘనతను ‘రానా నాయుడు’ తన ఖాతాలో వేసుకుంది.

Rana Naidu – ఇండియాలో నెంబర్ వెబ్ సిరీస్ గా ‘రానా నాయుడు’

2023 జనవరి నుంచి జూన్‌ వరకు ఎక్కువ వ్యూస్‌ వచ్చిన వాటి వివరాలను నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా వెల్లడించింది. గ్లోబల్‌గా ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న టాప్‌ 400ను విడుదల చేసింది. ఇందులో వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ టాప్‌ 336లో నిలిచింది. భారత్‌ నుంచి ‘రానా నాయుడు(Rana Naidu)’ సిరీస్‌ మాత్రమే టాప్‌ 400లో స్థానం దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ ను 46 మిలియన్ల గంటలు చూసినట్లు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ తెలిపింది. 2021 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ప్రతి వారం ఎక్కువ వ్యూస్‌ సాధించిన టాప్ 10 మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఈసారి ఆరు నెలల జాబితాను విడుదల చేసింది. వ్యూస్‌ ఆధారంగా సుమారు 18వేల టైటిల్స్‌ డేటాను పరిశీలించింది. గ్లోబల్‌గా ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న టాప్‌ 400ను విడుదల చేసింది. ఇందులో ‘రానా నాయుడు’ టాప్‌ 336లో నిలిచింది. భారత్‌ నుంచి ఈ సిరీస్‌ మాత్రమే టాప్‌ 400లో స్థానం దక్కించుకుంది.

త్వరలో ‘రానా నాయుడు 2’

కరణ్ అన్షుమాన్ మరియు సుపర్ణ్ వర్మ రూపొందించి, దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ లనికి అందుబాటులోనికి ఉంచింది. లోకోమోటివ్ గ్లోబల్ ఇంక్. బ్యానర్‌పై సుందర్ ఆరోన్ నిర్మించిన ఈ సిరీస్ 2013 లో అమెరికన్ క్రైమ్ టీవీ సిరీస్ రే డోనోవన్‌కి రీమేక్. దీని కోసం రానా(Rana), వెంకటేశ్‌ మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు. సుచిత్రా పిళ్లై, గౌరవ్ చోప్రా మరియు సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా దీనికి సీక్వెల్‌ను కూడా రూపొందిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా వెల్లడించింది. మరెన్నో ట్విస్టులు, మరింత ఫ్యామిలీ డ్రామాతో ‘రానా నాయుడు-2’ త్వరలో విడుదల కానున్నట్లు ప్రకటించింది

Also Read : NTR-Tripti Dimri: ఎన్టీఆర్‌ పై మనసుపడ్డ యానిమల్ బ్యూటీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com