Rana Daggubati : కేసులు నమోదు కావడంతో దెబ్బకు దిగి వస్తున్నారు యూట్యూబర్లు, సినీ రంగానికి చెందిన నటులు. తాను ఎనిమిది ఏళ్ల కిందట బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశానని, ఆ తర్వాత మానుకున్నానని ప్రకటించారు వివాదాస్పద నటుడు ప్రకాశ్ రాజ్. ప్రభుత్వాలను, సమాజాన్ని, తప్పు చేసిన వారిని నిరంతరం ప్రశ్నించే తాను ఇలాంటి వాటి పట్ల యువత చెడి పోతుందని గ్రహించానని, ఆ తర్వాత ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు.
Rana Daggubati Comment
ఇదే సమయంలో మొత్తం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి హైదరాబాద్ పోలీసులు 11 మంది యూట్యూటర్లతో పాటు మొత్తం సినీ రంగానికి చెందిన నటులతో కలుపుకుని 25 మందికి పైగా కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించారు. వీరిలో విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, విష్ణు ప్రియ, నిధి అగర్వాల్, దగ్గుబాటి రానా(Rana Daggubati), తదితరులు ఉన్నారు. దీంతో అటు రౌడీ టీం, ఇటు రానా బృందం స్పందించాయి. తమ నటులకు ఏమీ తెలియదని, అన్నీ బాగున్న బెట్టింగ్ యాప్స్ ను మాత్రమే ప్రమోషన్ చేశారని ఇందులో తప్పు ఎలా అవుతుందంటూ పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించాయి నటుల టీంలు. ఇక దగ్గుబాటి రానా టీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్ లైన్ నైపుణ్యం ఆధారిత గేమ్స్ కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారని తెలిపింది. ఒక కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని, 2017తో కాంట్రాక్టు ముగిసిందన్నారు. ఒప్పందాలు చేసుకునే ముందు రూల్స్, న్యాయ నిపుణులతో కలిసి చర్చించడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాతే ఒప్పందం చేసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. మొత్తంగా ఈ చిలుక పలుకులు పలికే నటులకు చెక్ పెట్టారు సీపీ.
Also Read : Ritu Choudhary Shocking :రీతూ చౌదరికి షాక్ ఫోన్ సీజ్