Ramya Krishnan: దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ లో శివగామి అనే ఫవర్ ఫుల్ పాత్రతో…. సెంకడ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది వెటరన్ నటి రమ్యకృష్ణ. ‘బాహుబలి’ లో శివగామి తరువాత ఈ సీనియర్ నటికి ఆ రేంజ్ రోల్ పడలేదు. బాహుబలి తరువాత వరుసగా సినిమాలైతే చేస్తున్నారు గానీ… ఏ పాత్ర కూడా శివగామి ఇమేజ్ ని మాత్రం మ్యాచ్ చేయలేకపోతున్నాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు’, ‘బంగార్రాజు’, ‘రిపబ్లిక్’, ‘రంగమార్తాండ’, ‘గుంటూరు కారం’ లాంటి సినిమాలు చేసినప్పటికీ అవేవి రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపించలేకపోయాయి. సాయి దుర్గాతేజ్ `రిపబ్లిక్` లో రమ్యకృష్ణ పవర్ పుల్ రోల్ పోషించినా అది ప్రేక్షకులను రీచ్ అవ్వకపోవడంతో ఎఫెర్ట్ అంతా వృధా ప్రయత్నంగానే మిగిలిపోయింది.
Ramya Krishnan Waiting
దీనితో రమ్యకృష్ణ(Ramya Krishnan) సరైన రోల్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అవకాశాలైతే వస్తున్నాయిగానీ ఆచితూచి ఎంపిక చేసుకుంటుది రమ్యకృష్ణ. ప్రస్తుతం ఆమె ఏ సినిమాకి సైన్ చేయకపోవడంతో… శివగామి రేంజ్ రోల్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి ఫవర్ ఫుల్ రోల్ సాధారణ దర్శకులతో ఊహించలేము కాబట్టి… ఆమె రాజమౌళి పిలుపుకోసమే ఎదురుచూస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే రాజమౌళి… మహేశ్ బాబు కాంబినేషన్ లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమాను నిర్మించడానికి కథను సిద్ధం చేసుకుని… ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా పట్టాలెక్కే లోపే రాజమౌళి నుండి శివగామికి పిలుపు వస్తుందని ఆమె ఆశిస్తున్నట్లు సమాచారం. మరి అది సాధ్యమవుతుందో? లేదో తెలియదు గానీ! రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలో ఓ ఫవర్ ఫుల్ రోల్ కోసం రమ్యకృష్ణ ఎదరుచూస్తుంది అనే బజ్ అయితే టాలీవుడ్ లో వినిపిస్తోంది.
గతంలో రాజమౌళి ‘సింహాద్రి’ సినిమాలో చిన్నదమ్మే చీకులు కావాలా అనే ఐటెం సాంగ్ లో నర్తించిన రమ్యకృష్ణ… చాలా ఏళ్ళ తరువాత బాహుబలిలో శివగామి పాత్రను ఒడిసి పట్టుకుంది. తాజాగా మహేశ్ బాబు గుంటూరు కారంలో కూడా ఆమె ముఖ్య పాత్ర పోషించింది. దీనితో అటు రాజమౌళి… ఇటు మహేశ్ బాబుతో ఉన్న అనుబంధంతో వారి కాంబినేషన్ లో వచ్చే నెక్ష్ట్ ప్రాజెక్టులో శివగామికి అవకాశం ఉందనే టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఆ ప్రాజెక్ట్ లో జక్కన్న అవకాశం ఇస్తున్నారా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Also Read : Pushpa 2 : డార్లింగ్ ప్రభాస్ తో పోటీ పడుతున్న బన్నీ పుష్ప 2