Ramya Krishnan : స్టార్ హీరోయిన్ కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే – రమ్య కృష్ణ

1990 నుంచి సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ చాలా పాపులర్ అనే చెప్పాలి...

Hello Telugu - Ramya Krishnan

Ramya Krishnan : టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హోమ్లీ క్యారెక్టర్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె నీలాంబరి వంటి విలన్ పాత్రలలో కూడా నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోలతో సమానంగా పారితోషకం తీసుకుంటూ మరింత పేరు సొంతం చేసుకుంది రమ్యకృష్ణ(Ramya Krishnan). సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో ఎదగాలనుకునే క్రమంలో ఇలాంటి ఇబ్బందులు తట్టుకోలేక కొంతమంది ఇండస్ట్రీకి దూరమైతే , మరి కొంతమంది వాటిని అధిగమించి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ మాత్రం స్టార్ హీరోయిన్ అవ్వాలంటే బెడ్ రూమ్ కి వెళ్లాల్సిందే అంటూ సంచలన కామెంట్లు చేశారు. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Ramya Krishnan Comment

1990 నుంచి సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న రమ్యకృష్ణ(Ramya Krishnan) ఇప్పటికీ చాలా పాపులర్ అనే చెప్పాలి. ఎలాంటి పాత్రలోనైనా సరే లీనం అయిపోయి నటించగలిగే కెపాసిటీ ఉన్న ఈమె.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారుగా 200 కు పైగా చిత్రాలలో నటించింది. సినీ కెరియర్ లో నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డుతో పాటు మూడు నంది అవార్డులు కూడా సొంత చేసుకుంది.

ఇదిలా ఉండగా మరొకసారి సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇతర రంగాలలో కూడా అత్యంత సాధారణ సమస్య. అయితే దీనిపై కొంతమంది తప్పుడు వార్తలను కూడా ప్రచారం చేస్తున్నారు. మహిళలు సినిమాల్లో స్టార్డం సంపాదించాలి అంటే అప్పుడప్పుడు రాజీ పడాల్సి ఉంటుంది. ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే దర్శకుడు లేదా హీరో కోరికలు కచ్చితంగా తీర్చాలి. వారి బెడ్ రూమ్ కి కూడా వెళ్లాలి అంటూ రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ పై ఊహించని విధంగా రమ్యకృష్ణ కామెంట్లు చేయడంతో ఈ విషయాలు కాస్త వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ విషయాలు తెలిసి నెటిజన్స్ కూడా రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Also Read : Kala Ratri Movie OTT : ఓటీటీలో అలరిస్తున్న మలయాళ థ్రిల్లర్ తెలుగులో..

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com