Ramnagar Bunny: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ‘రామ్ నగర్ బన్నీ’  ఫస్ట్ లుక్ రిలీజ్ !

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ 'రామ్ నగర్ బన్నీ'  ఫస్ట్ లుక్ రిలీజ్ !

Hello Telugu - Ramnagar Bunny

Ramnagar Bunny: ప్రముఖ బుల్లతెర నటుడు, వివిద టాక్ షోలకు హోస్ట్ గా వ్యవహరించిన ప్రభాకర్ తనయుడు, ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రామ్ నగర్ బన్నీ(Ramnagar Bunny)’. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.  ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, పొడకండ ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  అక్టోబర్‌లో ‘రామ్ నగర్ బన్నీ(Ramnagar Bunny)’ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను ప్రారంభించిన చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు.

Ramnagar Bunny Movie Updates

ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతుగా హీరో చంద్రహాస్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఆ మొత్తాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అందజేశారు .

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… ‘ప్రభాకర్ నాకు సుపరిచితులు. ఆయన రామ్ నగర్ బన్నీ సినిమా గురించి నాకు చెప్పారు. ఆయన పిలుపుమేరకు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఇందులో హీరోగా నటిస్తున్న చంద్రహాస్ మా అమ్మాయి క్లాస్ మేట్. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రహాస్ తన వంతు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. మొదటి సినిమాకు హీరోలు అంతగా ఆకట్టుకోరు. కానీ చంద్రహాస్ బాగున్నాడు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు. అతన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా.’ అని స్పీకర్‌ తెలిపారు.

‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ మాట్లాడుతూ … మా “రామ్ నగర్ బన్నీ(Ramnagar Bunny)” ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. రెండేళ్ల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. నేను సినిమాల్లో ఒకలా, బయట మరొకలా బిహేవ్ చేయను. నా మనసులో ఏముందో అదే మాట్లాడుతుంటా. అది కొందరికి నచ్చలేదు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారాను. అందుకు మా అమ్మా నాన్నలు ఎంతో సపోర్ట్ చేశారు.

మా నాన్న ప్రభాకర్ పేరు నిలబెట్టేలా కష్టపడతాను. నా ప్రతిభను నా సినిమాల రిజల్ట్ ద్వారానే తెలియజేయాలని భావిస్తున్నా. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటిలో ఫస్ట్ మూవీగా రామ్ నగర్ బన్నీ నెక్ట్ మంత్ అక్టోబర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ఒక ఫ్లోలో వెళ్తుంటుంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది. రామ్ నగర్ బన్నీ అనేది ఏ భాషలో సినిమా రిలీజ్ చేసినా కనెక్ట్ అయ్యే టైటిల్.  ప్రజల్ని ఎంటర్ టైన్ చేయాలని ఎలా అనిపించిందో వాళ్లు వరద బాధల్లో ఉన్నప్పుడు కూడా నా వంతుగా సాయం చేసి వాళ్లకు సంతోషాన్ని పంచాలని అనిపించింది. అందుకే నా కొద్దిపాటి సంపాదనలో వీలైనంత తెలంగాణ, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా కలెక్షన్స్ లో 10 శాతం వరద బాధితుల సహాయార్థం అందిస్తాం.’ అని ఆయన తెలిపారు.

Also Read : Subrahmanya Movie : హీరోగా ఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటుడు రవి శంకర్ తనయుడు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com