Ramcharan: డాక్టరేట్‌ అందుకున్న రామ్‌చరణ్‌ !

డాక్టరేట్‌ అందుకున్న రామ్‌చరణ్‌ !

Hello Telugu - Ramcharan

Ramcharan: గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌… చెన్నైకు చెందిన వేల్స్‌ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ ను అందుకున్నారు. కళారంగానికి చేసిన విశేష సేవలకు గానూ ఆయనకు ఈ గౌరవం దక్కింది. శనివారం నిర్వహించిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన రామ్ చరణ్ కు… విశ్వ విద్యాలయం విశిష్ట అతిధులు ఈ డాక్టరేట్‌ ను ప్రధానం చేసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్‌ వాటిని షేర్‌ చేస్తూ అభినందనలు చెబుతున్నారు. ఈ వేడుక ప్రారంభోత్సవానికి ముందు విశ్వవిద్యాలయం రామ్‌ చరణ్‌ గురించి ప్రత్యేక వీడియోను అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. అందులో ఈ మెగా హీరో చిన్నప్పటి సంగతులతో పాటు హీరోగా ఎదిగిన తీరును వర్ణించారు. సమాజానికి ఆయన చేస్తున్న సేవను చూపించారు.

Ramcharan Got

ఈ సందర్భంగా రామ్‌ చరణ్(Ramcharan) మాట్లాడుతూ… ‘‘నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి డాక్టరేట్‌ అందించిన వేల్స్‌ యూనివర్సిటీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 38 ఏళ్లుగా యూనివర్సిటీని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నందుకు యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు. ఇందులో 45వేలకు పైగా స్టూడెంట్స్‌ ఉన్నారు. ఇంత గొప్ప విశ్వవిద్యాలయం నుంచి నాకు డాక్టరేట్‌ వచ్చిందంటే మా అమ్మ నమ్మలేదు. ఇంతమంది గ్రాడ్యుయేట్స్‌ మధ్యలో ఇలా నిల్చోవడం ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి ఇది నాకు దక్కిన గౌరవం కాదు. నా అభిమానులది, దర్శకనిర్మాతలది, నాతోటి నటీనటులది.

చెన్నై నాకెంతో ఇచ్చింది. మా నాన్న తన సినీ ప్రయాణాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారు. ఉపాసన వాళ్లు అపోలో హాస్పిటల్స్‌ను కూడా ఇక్కడ నుంచే మొదలుపెట్టారు. తెలుగు సినీ పరిశ్రమలో 80 శాతం మందికి చెన్నైతో అనుబంధం ఉంది. ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఇక్కడికి వస్తే అది తప్పక నెరవేరుతుంది. అదీ ఈ ప్రాంతానికి ఉన్న గొప్పతనం. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చేస్తున్నా. ఆయనతో వర్క్‌ చేయాలని చాలామంది అనుకుంటారు. ఆయన ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఐదు భాషల్లో పాన్‌ఇండియా చిత్రంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నాం’’ అని చెప్పారు.

రామ్ చరణ్ డాక్టరేట్ అందుకోవడం గర్వంగా ఉంది: చిరంజీవి

‘తమిళనాడులో ప్రసిద్ధ విద్యాసంస్థగా కొనసాగుతున్న వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి రామ్‌ చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఒక తండ్రిగా ఎమోషనల్‌గా ఫీల్‌ అవడమే కాకుండా.. గర్వంగా భావిస్తున్నాను. పిల్లలు విజయాలను అధిగమించినప్పుడు ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం కలుగుతుంది. రామ్‌ చరణ్‌ చాలా స్థిరంగా విజయాలను అందుకుంటున్నాడు. లవ్ యు మై డియర్ డా.రామ్ చరణ్’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Also Read : Mahesh Babu : ఇంటర్నేషనల్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com