Ramayan : బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం ‘రామాయణ(Ramayan)’. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ఇప్పటికే అధికార ప్రకటన వచ్చింది. ఇటీవల రాముడి పాత్ర పోషిస్తున్న రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) పాత్రకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. అయితే మిగతా నటులు ఎవరనేది ఇప్పటిదాకా ఎలాంటి అప్‌డేట్ లేదు. తాజాగా నిర్మాణ సంస్థ లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీదేవోల్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని చెప్పారు. ‘‘అవతార్’, ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ తరహాలో రామాయణ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చాలా పెద్ద ప్రాజెక్ట్‌గా ఇది తెరకెక్కుతుంది. అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు. వీఎఫ్‌ఎక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్థ తీసుకుంటున్నారు. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. అందరూ దీన్ని ఇష్టపడతారు’ అని చెప్పారు. అయితే తాను ఏ పాత్రలో కనిపిస్తారనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పనని సన్నీదేవోల్ అన్నారు. ఆయన హనుమంతుడి పాత్రలో కనిపించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
Ramayan Movie Updates
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ కపూర్ మాట్లాడారు. ఎంతోమంది ప్రతిభగల కళాకారులు ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కు సంబంది?ంచి నా పాత్ర షూటింగ్ పూర్తయింది. త్వరలోనే రెండో భాగాన్ని మొదలుపెట్టనున్నాం’’ అన్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ కనిపించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్, కేౖకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ నటించనున్నట్లు తెలుస్తోంది. దీని వీఎఫ్‌ఎక్స్ కోసం నితేశ్ తివారీ టీమ్ ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్‌ఈజీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
Also Read : Ram Gopal Varma : డైరెక్టర్ ఆర్జీవీ కి బెయిల్ మంజూరు చేస్తూ ఉరటనిచ్చిన హైకోర్టు