Ramajogaiah Sastry: ప్రముఖ పాటల రచయిత, సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి పెద్ద కుమారుడు సాయితేజ వివాహం ప్రియాంకతో జరిగింది. శుక్రవారం హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించిన ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్ కి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి ప్రముఖులెందరో హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఆశ్వీరదించారు.
Ramajogaiah Sastry…
రామజోగయ్య శాస్త్రి కుమారుడు సాయితేజ వివాహానికి హాజరైన వారిలో అడివి శేషు, విజయ్ భాస్కర్, ఎస్వీ కృష్ణారెడ్డి, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, మెహర్ రమేష్, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, దగ్గుబాటి సురేష్ బాబు, రామ్ మిర్యాల, శ్రీ కృష్ణ, అర్మాన్ మాలిక్, రేవంత్, అనంత్ శ్రీరామ్, ధనుంజయ్, రమ్య బెహ్రా, శ్రీరామ్ చంద్ర తదితరులు ఉన్నారు.
Also Read : John Abraham: అబ్బాయిల పెంపకంలో వైఫల్యమే కోల్‌కతా ఘటనకు కారణం – జాన్ అబ్రహం