Ramaiah Vastavaiya Jawan : అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ దుమ్ము రేపుతోంది. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ , నయనతార, దీపికా పదుకొనే తో పాటు ప్రతి నాయకుడిగా విజయ్ సేతుపతి కలిసి నటించిన జవాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Ramaiah Vastavaiya Jawan Song Released
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్ కూడా విడుదల చేయడంతో భారీ ఆదరణ చూరగొన్నాయి. ఆగస్టు 29న మంగళవారం జవాన్ మూవీ మేకర్స్ రామయ్యా వస్తావయ్యా(Ramaiah Vastavaiya Jawan) సాంగ్ విడుదల చేశారు.
ఇందులో బాద్ షా షారుక్ ఖాన్ తో పాటు నయన తార, దీపికా అద్భుతంగా డ్యాన్స్ చేశారు. జవాన్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ఆయన అందించిన జైలర్ కూడా దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ .
జవాన్ చిత్రాన్ని అట్లీ కుమార్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. షారుక్ ఖాన్ భార్య దీనిని నిర్మించింది. దాదాపు రూ. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో దర్శకుడు రూపొందించారు. ఇప్పటికే విడుదల కాకుండానే రూ. 350 కోట్లు వసూలు చేయడం విస్తు పోయేలా చేసింది.
ఇక తాజాగా రిలీజ్ చేసిన రామయ్యా వస్తావయ్య సాంగ్ ను కుమార్ రాస్తే అనిరుధ్ రవిచందర్ , శిల్పా రావు, విశాల్ దద్లానీ ఆలాపించారు.
Also Read : Selvamani Roja : రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్