Ram Pothineni: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో యువ దర్శకుడు పి.మహేశ్‌బాబు తెరకెక్కించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. 2023లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పి.మహేశ్‌బాబుకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) కోసం దర్శకుడు పి.మహేశ్‌బాబు ఓ ఎమోషనల్ డ్రామా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథకు ఇప్పటికే రామ్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను సెప్టెంబరు నుండి ప్రారంభించబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
Ram Pothineni..
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేనిల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్తంగా నటి ఛార్మి నిర్మాతగా 2019లో విడుదల అయిన ఈ చిత్రం అటు పూరి, ఇటు రామ్‌కు ఓ డిఫరెంట్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. దీనితో దర్శకుడు పూరి జగన్నాథ్… ఈ సినిమాకు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ లో సంజయ్ దత్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, కావ్య థాపర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనితో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో జూలైలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read : Satyam Rajesh: సైలంట్ గా ఓటీటీకి వచ్చేసిన సత్యం రాజేశ్ ‘టెనెంట్’ !