Ram Pothineni: వెబ్ సిరీస్ లోనికి మరో టాలీవుడ్ స్టార్ హీరో ?

వెబ్ సిరీస్ లోనికి మరో టాలీవుడ్ స్టార్ హీరో ?

Hello Telugu - Ram Pothineni

Ram Pothineni: టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా ఓటీటీ బాటపడుతున్నారు. సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన రావడంతో… సినిమాలతో పాటు ఓటీటీలో కూడా తమ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే దగ్గుబాటి రాణా, విక్టరీ వెంకటేష్, నవదీప్, నాగ చైతన్య ఇలా చాలా మంది హీరోలు ఓటీటీ బాట పట్టి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో టాలీవుడ్ హీరో త్వరలో ఓటీటీ ప్రయాణం మొదలుపెట్టడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దేవదాస్, రెడీ, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన రామ్ పోతినేని(Ram Pothineni)… ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని సమాచారం. దీనితో ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తే త్వరలో రామ్ పోతినేని… వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Ram Pothineni in Webseries

ప్రస్తుతం రామ్ పోతినేని… ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రామ్ చేయబోయే తరువాత ప్రాజెక్టుల గురించి ఎలాంటి సమాచారం లేదు. దీనితో రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఈ నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ అవుతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాదు ఈ గుడ్ న్యూస్ ని ఈ నెల 15న రామ్… తన పుట్టినరోజు సందర్భంగా వినిపించనున్నట్లు తెలిసింది.

Also Read : Baahubali Crown of Blood: మే 17న రాజమౌళి ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్ బ్లడ్‌’ రిలీజ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com