RGV : భారత దేశ సినీ రంగంలో మోస్ట్ సెన్సేషన్ డైరెక్టర్ గా వినుతికెక్కారు రామ్ గోపాల్ వర్మ(RGV). ఎవరికీ తలవంచని తత్వం. అత్యంత అసాధారణమైన ప్రతిభా నైపుణ్యం కలిగిన దర్శకుడిగా వినుతికెక్కారు. తను తెలుగులో అక్కినేని నాగార్జునతో తీసిన శివ టాలీవుడ్ ను షేక్ చేసింది. కొన్నేళ్ల కిందట తాను తీసిన ఈ చిత్రం వర్దమాన నటీ నటులకు , టెక్నీషియన్లకు ఓ పాఠంగా ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది.
RGV Comment
జగపతిబాబుతో తీసిన గాయం మరో సూపర్ మూవీగా నిలిచింది. విక్టరీ వెంకటేశ్ , శ్రీదేవితో తీసిన క్షణం క్షణం చిత్రం సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అమీర్ ఖాన్, ఊర్మిలా మండోట్కర్ తో తీసిన రంగీలా రికార్డ్ బ్రేక్ చేసింది. అప్పటి దాకా మూసధోరణిలో ఉన్న బాలీవుడ్ ను షేక్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.
సినిమాలోని 24 ఫ్రేమ్స్ ను కంఠతః చెప్పే ఏకైక సినీ దర్శకుడు ఒకే ఒక్కడు రామూజీనే. ఆయన ఫ్యాక్టరీలో దర్శకులు, వర్దమాన నటులు, టెక్నీషియన్స్ ను పరిచయం చేశాడు. అందుకే ఆర్జీవీ అంటే ప్రతి ఒక్కరికీ గౌరవం. టెక్నికల్ గా అందరికంటే ముందుండే తను ఏది మాట్లాడినా లేదా ఏ ట్వీట్ చేసిన అది ఓ సంచలనమే.
బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశాడు. రంగీలా, సర్కార్, సత్య, కంపెనీ..ఇలా ప్రతి సినిమా ముంబై అండర్ వరల్డ్ మాఫియాను తెర మీద అద్భుతంగా ప్రజెంట్ చేసిన దర్శకుడు ఆర్జీవీనే. తన దర్శకత్వంలో వచ్చిన సత్యను చూసి తాజాగా రామ్ గోపాల్ వర్మ భావోద్వేగానికి లోనయ్యాడు.
Also Read : Kangana Emergency Movie : ఎమర్జెన్సీ పై నిషేధం కంగనా ఆగ్రహం