Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై మరో కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్

సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి...

Hello Telugu - Game Changer

Game Changer : గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్‌ చేంజర్‌(Game Changer)’. కాంబినేషన్‌ రీత్యా ఈ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ కౌంట్‌డౌన్ షురూ చేస్తూ ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. టీజర్ అనౌన్స్ మెంట్‌పై కూడా కాస్త క్లారిటీ ఇచ్చినట్లే తెలుస్తోంది.

Game Changer Movie Updates

సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికి కాస్త ఎర్లీగానే అంటే జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే నేటి నుండి జనవరి 75రోజుల గడువుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ 75 డేస్ కౌంట్‌డౌన్ మొదలుపెడుతూ.. ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ 75 రోజులో వ్యవధిలో చాలానే అప్డేట్స్ వచ్చేలా అర్థమవుతోంది. ఇప్పటి వరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా బాలకృష్ణ, వెంకటేష్, అజిత్, సందీప్ కిషన్ మూవీస్‌తో పోటీ పడాల్సి ఉంది. దీంతో అలర్ట్ అయినా మూవీ మేకర్స్ దీపావళి కానుకగా సినిమా టీజర్ విడుదల చేసి అభిమానుల్లో హైప్ పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు పుష్ప 2 సినిమా ఎలాంటి అప్డేట్స్ లేకుండానే పాన్ ఇండియా వైడ్‌గా విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read : Kiran Abbavaram : సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలుగు హీరో

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com