Ram Charan : మెగా ఫ్యామిలీ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. యావత్ ప్రపంచం ఫిబ్రవరి 14 కోసం ఎదురు చూస్తోంది. ఆరోజున ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించేందుకు అన్ని భాషల్లో సినిమాలు , వెబ్ సీరీస్, లఘు చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ సందర్బంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో కూడా రెడీ అయ్యాయి. మరో వైపు కొత్తగా గతంలో సూపర్ హిట్ అయిన మూవీస్ ను తిరిగి రిలీజ్ చేసే సంప్రదాయం కొత్తగా మొదలైంది. ఈ జాడ్యం టాలీవుడ్ కు పాకింది.
Ram Charan Movie Updates
తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్(Ram Charan) కీలక పాత్రలో నటించిన చిత్రం ఆరెంజ్. తనతో పాటు జెనీలియా దేశ్ ముఖ్ నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. రొమాంటిక్, కామెడీ డ్రామాగా తెరకెక్కించాడు చిత్రాన్ని దర్శకుడు.
ప్రేమికుల దినోత్సవం సందర్బంగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ప్రేమికులను అలరించేందుకు గాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు 14న ఆరెంజ్ ను తిరిగి రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం 2010లో విడుదలైంది.
ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులోని సంగీతం, పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి.
హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా ఎవర్‌గ్రీన్ క్లాసిక్ ఆల్బమ్‌గా మారింది. కిరణ్ రెడ్డి , బి. రాజశేఖర్ కెమెరామెన్‌గా వ్యవహరించగా, మార్తాండ్ కె వెంకటేష్ ఈ రొమాంటిక్ చిత్రానికి ఎడిట్ చేశారు.
Also Read : Hero Salmaan-Murugadoss :ఆ మూవీ పైనే మురుగదాస్ ఫోకస్