Ram Charan : ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సతీమణి ఉపాసన కొణిదెల, కుమార్తె క్లింకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో వెంకన్న దర్శనం చేసుకున్నారు. కుమార్తె క్లింకార తలనీలాలు సమర్పించి శ్రీవారిని మొక్కు తీర్చారు. వీరికి రంగనాయకుల మండపంలోని వేదపండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్, భార్య ఉపాసన, కుమార్తెతో కలిసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే శ్రీవారి దర్శనానంతరం ఆలయం నుంచి బయటకు రాగానే క్లీక్లింకార ముఖం బయటపడింది. మరోవైపు ఉపాసన మెగా ప్రిన్సెస్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. రామ్ చరణ్ తనయ చాలా అమాయకంగా కనిపించింది. క్లింకార మొహం చెర్రీని పోలి ఉందని అభిమానులు వ్యాఖ్యానించారు.
Ram Charan Daughter Photo Viral
ఉపాసన ఈ రోజుల్లో తన స్వచ్ఛమైన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతోంది. క్లీంకారా ముఖాన్ని చూపకుండా వారు షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటోలకు ఎమోజీలను జోడించారు. అయితే క్లింకారని చూడాలి.. మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చూపించండి అంటూ కామెంట్స్ చేస్తూనే, ఈరోజు చరణ్(Ram Charan) పుట్టిన రోజు కావడంతో యాదృచ్ఛికంగా క్లింకార ఫేస్ రివీల్ కావడం ఆనందాన్ని కలిగించింది. అంటున్నారు అభిమానులు.
ఈ విషయంలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా చరణ్ పేరు గురించే మాట్లాడుకుంటున్నారు. సినీ తారలు, అభిమానులు తమ అభిమాన హీరోలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చరణ్‌కి సంబంధించిన అరుదైన ఫోటోలు మరియు వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. కాగా, చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని ‘జరగండి జరగండి’ పాటను విడుదల చేశారు. అలాగే ఈరోజు చరణ్ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read : Anjali : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత తో జర్నీ బ్యూటీ ఏడడుగులు వేయనుందా..?